HomeAndhra Pradeshఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ఈడీ సోదాలు - మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ఈడీ సోదాలు – మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ఈడీ సోదాలు – మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం

అమరావతి:
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన అక్రమాల కేసులో ఈరోజు ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.గ్రూప్-1 మూల్యాంకనంతో సంబంధమున్న క్యామ్‌సైన్ మీడియా, ఇతర ప్రైవేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. మూల్యాంకనానికి చెల్లించిన నిధులు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణ జరుపుతోంది.కేసు నేపథ్యం:2018లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, 2020 డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలుడిజిటల్ మూల్యాంకనంతో పాటు రెండు దశల్లో మాన్యువల్ మూల్యాంకనం – సిట్ నివేదికమంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో 84 రోజులపాటు జవాబు పత్రాల మూల్యాంకనంఅర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణక్యామ్‌సైన్ మీడియాకు రూ. 1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ. 1.38 కోట్లు చెల్లింపు287 బార్‌కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగం – సిట్ గుర్తింపు173 మంది సాక్షుల విచారణ, ఫోరెన్సిక్ ఆధారాల పరిశీలన2025 ఏప్రిల్‌లో పోలీసు కేసు నమోదు, పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ డైరెక్టర్ మధుసూదనరావు అరెస్ట్ అయ్యారు. హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతుండగా, 2026 అక్టోబర్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తాజాగా సోదాలు చేపట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments