ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారిత కథలకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో, భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త ప్రయోగం తెరపైకి వచ్చింది. ప్రాచీన పురాణ రహస్యాలు, అత్యాధునిక ఏఐ సాంకేతికత కలయికతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’ టైటిల్ పోస్టర్‌ను ఆర్విహా క్రియేషన్స్ సంస్థ దసరా కానుకగా విడుదల చేసింది. నిర్మాత నరేష్ గౌడ్ నేతృత్వంలో నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల ఈ సైన్స్-ఫిక్షన్ మైథలాజికల్ డ్రామాను రూపొందిస్తున్నారు. విజువల్ వండర్‌గా 3డీ ఫార్మాట్‌లో సిద్ధమవుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో 2027 వేసవిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఏఐ టెక్నాలజీతో మైథాలజీ విజువల్ వండర్… ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది ప్రాంప్ట్ వార్’ కాన్సెప్ట్
RELATED ARTICLES


