పెళ్లి రోజున చేసుకున్న ప్రమాణాలను 20 ఏళ్ల తర్వాత మరోసారి గుర్తుచేసుకుంటే.. ఆ క్షణం ఎంతో ప్రత్యేకంగా, కొత్తగా ఉంటుంది కదా! జ్యోతిక, సూర్య విషయంలో ఇప్పుడు అదే జరిగింది. సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడి 2006లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ సినీ కెరీర్‌తో పాటు కుటుంబ జీవితాన్ని కూడా ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు. పెళ్లయి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ జంట మరోసారి తమ పెళ్లి ప్రమాణాలను గుర్తుచేసుకున్నారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రత్యేకంగా ది సీక్వెల్ పేరుతో వోస్ రిన్యూవల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇటీవల జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 20 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఎదురైన సర్దుబాట్లు, అవగాహన, త్యాగాలు, స్నేహాన్ని కూడా ఈ వేడుకలో గుర్తుచేసుకున్నారు. మరి జ్యోతిక, సూర్య తమ 20 ఏళ్ల ప్రయాణం గురించి ఏం చెప్పారు, భార్యభర్తల మద్య ఎలాంటి సంబంధాలు ఉండాలి వంటి అనేక విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


