Niranjan Reddy Viral Video: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు తమ్ముడులాంటి వాడైనా బావమరది అవుతారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ వివాహానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంతో సహా హాజరయ్యారు. ఇదే వివాహానికి హాజరైన నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పీ తల్లితో కాసేపు ముచ్చటించారు. తన కుమారుడికి మీ ఆశీర్వాదాలు కావాలని నిరంజన్ రెడ్డితో పెద్దావిడ అనగా.. ఆర్ఎస్పీ తనకు తమ్ముడులాంటి వాడని చెప్పారు. అంతకంటే ఎక్కువ బావమరది అవుతారంటూ సరదాగా ముచ్చటించారు. అందుకు గల కారణం కూడా వెల్లడించారు.


