ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఈ నాలుగు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 9,450 కోట్లు కాగా.. 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త.. ఏపీ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
RELATED ARTICLES


