HomeAndhra Pradeshఅన్నం పెట్టడం లేదు.. నడవలేకపోతున్నా.. గుండెల్ని పిండేస్తున్న 9 ఏళ్ల పసివాడి ఆవేదన.. చలించిపోయిన మంత్రి...

అన్నం పెట్టడం లేదు.. నడవలేకపోతున్నా.. గుండెల్ని పిండేస్తున్న 9 ఏళ్ల పసివాడి ఆవేదన.. చలించిపోయిన మంత్రి నారా లోకేష్

సోషల్ మీడియాలో ఓ బాలుడి వీడియో ఎందరో హృదయాలను కదిలించింది. ప్రకాశం జిల్లా, రాచవారిపాలెంలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు గొర్రెల కాపరిగా కనిపించాడు. అటు వైపుగా వెళ్తున్న ఆ బాలుడిని పలకరించగా.. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. తనకు అన్నం పెట్టడం లేదని, సరిగ్గా నడవలేకపోతున్నానని వాపోయాడు. అన్నా అమ్మకి చెప్పండి తనను తీసుకెళ్లమని అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో వాళ్లు ఆ చిన్నారి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని, అధికారులను వెంటనే స్పందించమని కోరారు. దాంతో మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆ బాలుడికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments