HomeTELANGANAఅక్టోబర్‌లో 95 శాతం లోటు వర్షపాతం.. 12 జిల్లాల్లో చినుకు జాడలేదు.. ఆ ఒక్క జిల్లాలోనే...

అక్టోబర్‌లో 95 శాతం లోటు వర్షపాతం.. 12 జిల్లాల్లో చినుకు జాడలేదు.. ఆ ఒక్క జిల్లాలోనే కాస్తలో కాస్త మెరుగు..!

నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ నెలలో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటాయి. హైదరాబాద్ నగరంలోనైతే కాస్త ఎక్కువగానే వానలు పడుతుంటాయి. 2020 అక్టోబర్‌లో భాగ్యనగరంలో ఏకంగా 400 మి.మీ. వర్షం కురిసింది. అయితే ఈసారి ఎల్‌నినో కారణంగా పూర్తిగా సీన్ రివర్సయ్యింది. అక్టోబర్ తొలి మూడు వారాలకు గానూ రాష్ట్రంలో ఏకంగా 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఏకంగా 12 జిల్లాల్లో ఈ మూడు వారాల్లో చినుకు జాడ కానరాలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments