HomeTELANGANAVemulawada Temple: రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయంలో డిజిటల్‌ చెల్లింపులు, ఇక నగదుతో...

Vemulawada Temple: రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆలయంలో డిజిటల్‌ చెల్లింపులు, ఇక నగదుతో పనిలేదు

Vemulawada Devotee Facilities: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం డిజిటల్‌ చెల్లింపులను విస్తరిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, భీమేశ్వరసదన్‌లో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. బుకింగ్‌ కౌంటర్‌, ప్రొటోకాల్‌ కార్యాలయం, విరాళాల కౌంటర్లలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు. త్వరలో పీవోఎస్‌ మిషన్ల సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పలు ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. పారదర్శకత, భక్తులకు నగదు కష్టాలు లేకుండా చేయడమే లక్ష్యమని ఈవో రమాదేవి తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments