The Paradise Priyadarshi Character: నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ మూవీ ఇవాళ పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. విడుదలైన వెంటనే సినిమాలోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అన్న పాత్ర లుక్, మాట్లాడే విధానం కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. దివంగత ఎన్టీఆర్‌కు సంబంధించిన రిఫరెన్స్‌లు కూడా సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు అభిమానులతో కలిసి థియేటర్లో ది ప్యారడైజ్ మూవీని వీక్షించిన వీడియో వైరల్‌గా మారింది.


