Stock Market Crash Reasons: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్లకుపైగా పడిపోయింది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండిగో అత్యధికంగా పడిపోయాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ 2007 నాటి గరిష్ఠాలకు పెరగడం, క్రూడ్ ధరలు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, IRDIA కొత్త నిబంధనలు వంటివి ప్రభావం చూపుతున్నాయి.


