SBI Cash Withdrawal Charges: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ సడెన్ షాక్ ఇచ్చింది. తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపైనా ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఇక్కడ తమ ఫీ స్ట్రక్చర్ సవరించిన నేపథ్యంలో ఈ అకౌంట్ హోల్డర్ల విత్‌డ్రాలపై నిర్దిష్ట పరిమితి దాటితే ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.


