
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త అడ్వెంచర్ టూరర్ బైక్ Himalayan 750ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ఈ బైక్‌లో 743cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 55 PS పవర్, 63 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అడ్జస్టబుల్ Showa సస్పెన్షన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
వేరియంట్ల వారీగా ధరలు:
క్యాస్ట్ వీల్స్ వేరియంట్ – రూ.4,89,490
స్పోక్ వీల్స్ వేరియంట్ – రూ.5,14,495GIVI
లగేజీతో Antarctic Silver – రూ.6,29,000
అన్ని ధరలు ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ చెన్నై ధరలు.గోవాలో జరుగుతున్న Motoverse కార్యక్రమంలో నవంబర్ 28, 29 తేదీల్లో ముందస్తు బుకింగ్ అవకాశం కల్పించారు.
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌తో పాటు డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.


