HomeEntertainmentRajinikanth: 8 రోజుల్లో రూ. 600 కోట్ల క్లబ్‌లోకి... కోలీవుడ్‌ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా ‘జైలర్ 2’!

Rajinikanth: 8 రోజుల్లో రూ. 600 కోట్ల క్లబ్‌లోకి… కోలీవుడ్‌ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా ‘జైలర్ 2’!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ ధమాకా ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే 100 శాతం రికవరీ సాధించి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 606.05 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వేగంగా రూ. 600 కోట్ల క్లబ్‌లో చేరింది. భారతదేశంలో నికర వసూళ్లు రూ. 334.35 కోట్లకు చేరుకోగా, ఎనిమిదో రోజున రూ. 17.15 కోట్ల నెట్ సాధించింది. తమిళంతో పాటు తెలుగు, కర్ణాటక మార్కెట్లలోనూ భారీ ఆక్యుపెన్సీతో దూసుకుపోతూ రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments