EPFO First Time Employee Benefits: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-VBRY స్కీమ్ కింద అర్హులైన, తొలిసారి ఉద్యోగంలో చేరిన వారు రూ. 15 వేల వరకు ప్రోత్సాహకం పొందొచ్చు. నెలలవారీగా గ్రాస్ శాలరీ రూ. 1 లక్షలోపు ఉండాలి. ఈ మొత్తం 2 విడతల్లో అందుతుంది. రెండో విడత పొందాలంటే 12 నెలల సర్వీసుతో పాటుగా ఈపీఎఫ్ఓ సూచించిన ఆర్థిక అక్షరాస్యత (ఫైనాన్షియల్ లిటరసీ) కోర్సును పూర్తి చేయాలి.


