HomeTELANGANAKhairatabad By election: ఖైరతాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ.. కవిత సంచలన ప్రకటన

Khairatabad By election: ఖైరతాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ.. కవిత సంచలన ప్రకటన

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన (TRs) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాల గణాంకాలను ప్రస్తావిస్తూ వైద్య రంగంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, దానం నాగేందర్ అనర్హతను హైకోర్టు ప్రకటించడం, ఆ తీర్పుపై ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments