Mobile Racharge New Rules: జియో, ఎయిర్టెల్, వీఐ వంటి మొబైల్ నెట్వర్క్ యూజర్లకు బిగ్ రిలీఫ్ లభించింది. ఇక నుంచి మీరు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 రీఛార్జులు సరిపోతాయి. అలాగే డేటా అవసరం లేని వారు కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


