సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మొదటి ఐదు రోజుల్లోనే ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా రూ. 242.25 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 477.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సోమవారం సైతం రూ. 42.35 కోట్ల నెట్ రాబట్టి తన తిరుగులేని సత్తా చాటింది. నేడు విజయదశమి పండుగ సెలవు కావడంతో బుకింగ్ పోర్టల్స్‌లో గంటకు 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ దసరా జోరుతో ఆరో రోజైన మంగళవారమే ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ఘనంగా అడుగుపెట్టడం ఖాయమైంది. ఫుల్ రన్‌లో ‘జైలర్ 2’ రూ. 1000 కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Jailer 2 500 cr Club: బాక్సాఫీస్ వద్ద తలైవా ఊచకోత… నేడు రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’!
RELATED ARTICLES


