Infosys Q2 Results: దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించిన రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కంపెనీ ఏకీకృక నికర లాభం 6 శాతం మేర పెరిగి రూ.7823 కోట్లుగా నమోదు చేసింది. మూడు నెలల కాలంలో కంపెనీ లాభం పెరిగినప్పటికీ వచ్చే త్రైమాసికాల్లో ఆదాయ అంచనాలను తగ్గించడం గమనార్హం. అలాగే మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాల వివరాలు తెలుసుకుందాం.


