సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ హీరో కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘హాయ్’. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ప్రభు కీలక పాత్రల్లో నటించారు. దివంగత దర్శక నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి మూవీ ఇది. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, ఆగస్టు 28న విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


