Avenue Supermarts Profit: డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. క్యూ2లో నికర లాభం 7.6 శాతం పెరిగి రూ. 804 కోట్లుగా నమోదైంది. ఆదాయం 18.4 శాతం పెరిగి రూ. 19206 కోట్లకు చేరుకుంది. అయితే లాభం, ఎబిటా ఈసారి మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్ కొత్తగా 15 స్టోర్లను తెరిచింది. పూర్తి వివరాలు చూద్దాం.


