Shooting Gold India: 2026 ఆసియా క్రీడల్లో భారత్ రెండో గోల్డ్ మెడల్ సాధించింది. భారత షూటర్లు సురుచి సింగ్, కమల్జీత్ శుక్రవారం రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించారు. ఫైనల్లో ఏకంగా 484.6 పాయింట్లతో ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పిన ఈ జోడీ భారత్కు ఈ ఆసియా క్రీడల్లో రెండో గోల్డ్ మెడల్ అందించింది. అంతకుముందు మహిళల క్రికెట్లో తొలి గోల్డ్ వచ్చింది.


