Sudha Murty Workplace Stereotypes: చీర కట్టుకున్నందుకు తనను బెహన్జీ అని పిలిచారని, ఇంగ్లీష్ రాదనుకున్నారని, పరిజ్ఞానం తక్కువని కొందరు భావించినట్లు సుధా మూర్తి వెల్లడించారు. మహిళల తెలివితేటలను దుస్తులతో అంచనా వేయడం సరికాదని చెబుతూ, చీరతోనూ బోర్డ్ రూంలో ఆత్మవిశ్వాసంగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో సూట్ ధరిస్తేనే స్మార్ట్‌గా కనిపిస్తారా? అని ప్రశ్నించారు.


