HomeTELANGANAజీఎస్టీతో ఏటా రూ.800 కోట్లకుపైగా తెలంగాణ ఆదాయంపై ప్రభావం.. సంస్కరణలపై భట్టి రియాక్షన్

జీఎస్టీతో ఏటా రూ.800 కోట్లకుపైగా తెలంగాణ ఆదాయంపై ప్రభావం.. సంస్కరణలపై భట్టి రియాక్షన్

జీఎస్టీ, అందులో తీసుకువస్తున్న సంస్కరణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్‌ వాహనాలకు సంబంధించిన మార్పుల వల్ల తెలంగాణకు ఏటా సుమారు రూ.800 కోట్ల ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, బోగస్‌ ఇన్వాయిస్‌లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆదాయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జీఎస్‌టీఎన్, జీఎస్టీ కౌన్సిల్‌ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భట్టి ప్రతిపాదించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments