గురుగ్రామ్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.70,000 విలువ చేసే ఒక పాత మోటార్ సైకిలుపై ఏకంగా 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు బయటపడింది. ఆ చలాన్ల జరిమానా మొత్తం రూ.10,30,000గా తేలడంతో పోలీసులు, వాహనదారుడు షాక్ తిన్నారు. హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు, నంబరు ప్లేటు లేకపోవడంతో నమోదైన ఈ భారీ జరిమానా కేసులో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


