HomeSportsసచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..!

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..!

వెస్ట్ ఇండీస్‌తో గౌహతిలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా ఆల్-టైమ్ రికార్డు సృష్టించాడు. సచిన్ 300 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరగా, రోహిత్ కేవలం 282 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. మొదటి స్థానంలో 242 ఇన్నింగ్స్‌లతో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ వన్డేల్లో తన 35వ సెంచరీ సాధించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments