మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కొలువుదీరిన ఉజ్జయిని నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. క్షిప్రా నది సింహస్థ కుంభమేళా 2028లో జరగనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రహదారులను విస్తరిస్తున్నారు. అయితే, పురాతన ఓ మసీదు కాంప్లెక్స్‌లో కొంత భాగాన్ని కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది.


