HomeTELANGANAఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర రథసారథిగా వెంకటరెడ్డి.. ఇప్పటికే 3 సార్లు, 26 ఏళ్ల అనుభవం..!

ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర రథసారథిగా వెంకటరెడ్డి.. ఇప్పటికే 3 సార్లు, 26 ఏళ్ల అనుభవం..!

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రలో భారీ విగ్రహాన్ని మోసుకెళ్లే టస్కర్‌ డ్రైవర్‌గా మరోసారి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ ట్రాన్స్‌పోర్టులో 26 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయనకు భారీ వాహనాలు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. 2017, 2020, 2025లోనూ ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర వాహనాన్ని నడిపి.. గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ ఏడాది నాలుగోసారి రథసారథిగా వ్యవహరించారు. 26 టైర్ల భారీ టస్కర్‌ను లక్షలాది మంది భక్తుల మధ్య అత్యంత నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments