Vangaveeti Radha Meet Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ భేటీలో ఇద్దరి మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న స్నేహం గురించి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, సంస్కరణలపై వంగవీటి రాధాకృష్ణ అభినందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటీ రాధా భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఆసక్తికర పరిణామం
RELATED ARTICLES


