Tax Notice: షేర్ మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్ కొన్నిసార్లు ఊహించని రిటర్న్స్ ఇస్తాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టి భారీగా లాభపడిన వారూ ఉన్నారు. అయితే, స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ చిక్కులు వస్తుంటాయి. అలా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి రూ.70 వలే పెట్టుబడిపై ఏకంగా రూ.1.93 కోట్లు లాభం వచ్చింది. అయితే ఈ లాభాలపై ట్యాక్స్ రాయితీని ఐటీ శాఖ తిరస్కరించింది. చివరకు ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
Tax Notice: స్టాక్ మార్కెట్లో ఓ వ్యక్తి పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో భారీ లాభాలు అందుకున్నారు. ముంబైకి చెందిన ఆ ఇన్వెస్టర్‌కి రూ.70 వేలు పెట్టుబడిపై లాంగ్ టర్మ్‌లో ఏకంగా రూ.1.93 కోట్ల లాభాలు వచ్చాయి. అయితే, ఈ లాభాలు సరైనవేనని గుర్తించడానికి బదులుగా బోగస్ పెన్నీ స్టాక్ ట్రాన్సాక్షన్‌గా ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. మొత్తం నగదు పన్ను పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ నోటీసులు పంపించింది. ఈ కేసు ముంబై ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) వద్దకు వెళ్లగా కీలక తీర్పు వెలువడింది. సదరు ఇన్వెస్టర్‌కు ఉపశమనం లభించింది. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు ఏం జరిగింది?
ముంబైకి చెందిన సంజయ్ కుమార్ మెహతా ఫైల్ చేసిన అసెస్మెంట్ ఇయర్ 2015-16కు సంబధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కేసు. రూ.1.93 కోట్ల లాభాలకు సంబంధించి ట్యాక్స్ నోటీసులను సెప్టెంబర్ 4, 2026 రోజున కొట్టి వేస్తూ ముంబై ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. షేర్ ట్రాన్సాక్షన్ సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పింటారని, ట్యాక్స్ విభాగం బోగస్ అని తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంటూ సదరు ఇన్వెస్టర్‌కు ఉపశమనం కల్పించింది.
రూ.70 వేల నుంచి రూ.1.93 కోట్లు
2013, ఏప్రిల్ నెలలో టొయామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన 35 వేల షేర్లను రూ.70 వేలు పెట్టి కొనుగోలు చేసినట్లు మెహతా తెలిపారు. మొదట ఈ షేర్లను భౌతికంగా అలాట్ చేశారు. ఆ తర్వాత 2014లో బ్రోకర్ ద్వారా డిజిటల్ విధానంలోకి మార్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2014, ఫిబ్రవరి 2015 మధ్య ఆ షేర్లను రూ.447 నుంచి రూ.556 మధ్య మెహతా విక్రయించారు. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ.2.14 కోట్లు వచ్చాయి. అందులో రూ.1.93 కోట్లు టొయామ్ ఇండస్ట్రీస్ షేర్ల నుంచే వచ్చినట్లు తెలిపారు. ఈ సేల్ ట్రాన్సాక్షన్ అనేది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. తాను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ సైతం చెల్లిచానని తెలిపారు. బ్రోకర్ ద్వారా సేల్ ప్రొసీడింగ్స్ సైతం పొందానని, తన బ్యాంకు ఖాతాలో స్పష్టంగా ఉందని ట్రిబ్యునల్ వద్ద వెల్లడించారు.
ట్యాక్స్ విభాగం ఎందుకు బోగస్ గా పేర్కొంది?
పెన్నీ స్టాక్ లావాదేవీలపై జరిపిన విచారణ ఆధారంగా ఇన్సైట్ పోర్టల్ ద్వారా పన్ను శాఖకు సమాచారం వచ్చింది. దర్యాప్తు విభాగం గుర్తించిన 18 స్క్రిప్‌లలో టోయమ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. అసెస్మెంట్ ఆర్డర్ ప్రకారం, కొన్ని పెన్నీ స్టాక్‌లలో కృత్రిమ దీర్ఘకాలిక మూలధన లాభాలు, స్వల్పకాలిక మూలధన నష్టాలను సృష్టించడానికి అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. టోయం ఇండస్ట్రీస్ షేర్ ధరలో వచ్చిన భారీ పెరుగుదలకు ఆ కంపెనీ ఆర్థిక పునాదుల మద్దతు లేదని కూడా నిర్ధారణ అధికారి గుర్తించారు.
దర్యాప్తు నివేదిక ఆధారంగా.. పన్ను చెల్లింపుదారుని దీర్ఘకాలిక మూలధన లాభం నిజమైనది కాదని అసెస్మెంట్ ఆఫీసర్ నిర్ధారించారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 కింద రూ. 1.93 కోట్లను వివరించలేని నగదు క్రెడిట్‌గా పరిగణించారు. సదరు ట్యాక్స్ పేయర్‌కి నోటీసులు పంపించగా మొదట సీఐటీఏ వద్ద అప్పీల్ చేసినా ఉపశమనం లభించలేదు. చివరకు ఐటీఏటీ ముంబై బెంచ్ వద్ద ఉపశమనం లభించింది.


