Telangana Dussehra School Holidays:తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సందర్భంగా అక్టోబరు 10 నుంచి 22వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. అకడమిక్ విద్యా క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 10 రెండో శనివారం, 11, 18 తేదీలు ఆదివారాలు కావడంతో నికరంగా పది రోజుల సెలవులుగా పరిగణించనున్నారు. దసరా సెలవులకు ముందే ఎస్ఏ-1 పరీక్షలను పూర్తిచేయనున్నారు. అక్టోబరు 1న ప్రారంభమయ్యే సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు అక్టోబరు 9తో ముగియనున్నాయి.


