ఖైరతాబాద్ ఉపఎన్నికలో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పార్టీ పేరు ఇప్పుడే వెల్లడించబోనని.. టికెట్ వచ్చిన తర్వాతే చెబుతానని స్పష్టం చేశారు. అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ చెబుతున్నప్పటికీ.. ఏ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగుతారనే దానిపై మాత్రం ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.


