మనలో చాలా మందికి ఉదయాన్ని టీతోనే ప్రారంభిస్తారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి వేడి టీ కప్పు తాగాల్సిందే. రోజంతా ఆఫీస్ వర్క్‌లో అలసిపోయినప్పుడు ఓ కప్పు చాయ్ తాగితే వచ్చే కిక్కే వేరు. అలసట తీరి మూడ్ మొత్తం మారిపోతుంది. అయితే, చాలా మందికి ఇంట్లో టీ చేసుకున్నప్పుడు ఓ బాధ ఉంటుంది. అర్రే.. రోడు పక్కన బండి లేదా హోటల్లో దొరికే టీ రుచి రావడం లేదని బాధపడుతుంటారు.
వాళ్లేదే రకరకాల టీ పొడులు, మసాలాలు వాడుతున్నారని అనుకుంటారు. కానీ అసలు తేడా టీని తయారు చేసే విధానంలోనే ఉంటుంది. టీ పెట్టేటప్పుడు ముందుగా పాలు పోయాలా లేక నీళ్లు పోయాలా అనే ఒక చిన్న విషయమే టీ రుచిని, సువాసనను పూర్తిగా మార్చేస్తుంది. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మరి అసలైన పద్ధతి ఏంటో వివరంగా తెలుసుకుందాం.


