HomeAndhra Pradeshఓయో నిఖిత మృతి కేసులో కీలక పరిమాణం, అనుమానితుడు రవితేజ ఆత్మహత్యా యత్నం

ఓయో నిఖిత మృతి కేసులో కీలక పరిమాణం, అనుమానితుడు రవితేజ ఆత్మహత్యా యత్నం

మాదాపూర్ ఓయో హోటల్లో యువతి మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడైన శ్రీనివాస రవితేజ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్ తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే రవితేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్‌, రోడ్‌ నెంబర్ 5లో ఉన్న ఓయో హోటల్ రూమ్‌లో షారోన్‌ నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments