జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అంపైర్లపై ఒత్తిడి తెచ్చి ‘వైడ్’ నిర్ణయాన్ని మార్పించిందనే ప్రచారంలో నిజం లేదని తేలింది. ఆఖరి ఓవర్‌లో జపాన్ బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించినప్పుడు ఐసీసీ రూల్‌బుక్ ప్రకారం లెగ్-సైడ్ వైడ్ వర్తించదు. తప్పుగా ఇచ్చిన వైడ్‌ను అంపైర్ క్రిస్ థర్గేట్, సీనియర్ అంపైర్ క్రిస్ బ్రౌన్‌తో చర్చించి ఉపసంహరించుకున్నారు. కొత్త బంతి వేయకముందే నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం నిబంధనల ప్రకారం పూర్తిగా చట్టబద్ధమైనదేనని ఐసీసీ చెబుతోంది.


