నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వేళకు తినకపోవడం వల్ల గ్యాస్, కడుపులో మంట, అల్సర్, మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు చాలా మందిని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇవి ప్రాథమిక సమస్యలుగా అనిపించినప్పటికీ సరైన సమయంలో శ్రద్ధ తీసుకోకపోతే జీవన నాణ్యతను దెబ్బతీసి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి. అయితే వీటికి ఖరీదైన మందుల కంటే మన వంటగదిలో లభించే సహజసిద్ధమైన ఆహార పదార్థాలు, మూలికలు అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తాయి.
ప్రతిరోజూ మనం తీసుకునే మజ్జిగ, మంచినీళ్లు, పీచుపదార్థాలు ఉన్న పండ్లు, పచ్చని ఆకు కూరలు మన పేగులను శుభ్రపరిచి జీర్ణవ్యవస్థను తిరిగి ఆరోగ్యంగా మారుస్తాయి. అలాగే కడుపులో యాసిడ్లను పెంచే టీ, కాఫీ, పాలు వంటి వాటికి దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ఈ సమస్యల శాశ్వత పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన చిట్కాలను సరైన పద్ధతిలో పాటించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్టను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


