దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్‌పై దానం నాగేందర్ పోటీ చేశారు. దీన్ని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ ఆయనపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిటిషన్లను తిరస్కరించడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది.


