అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి. ముడిచమురు ధరలు తగ్గడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కాస్త దిగిరావడంతో బుధవారం ఉదయం ఎంసీఎక్స్ లో పసిడి, వెండి కాంట్రాక్టులు లాభాల్లో ట్రేడవుతున్నాయి.