ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో మెరిసిన షఫాలీ వర్మ అరుదైన రికార్డు సాధించింది. 2026 క్యాలెండర్ ఇయర్లో మహిళల టీ20ఐలలో భారత్ తరఫున అత్యధిక పరుగులు (593 రన్స్, 151.67 స్ట్రైక్ రేట్) చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన (590)ను అధిగమించింది. ఈ విజయంతో భారత్.. ఫైనల్ చేరింది. సెప్టెంబర్ 13న తుది పోరు జరగనుంది. శ్రీలంక, పాక్ జట్ల మధ్య జరిగే సెమీస్‌లో గెలిచిన జట్టు భారత్‌తో తలపడనుంది.


