భోజనం చివర్లో కాస్త గడ్డ పెరుగు ఉంటే చాలు.. చాలా మందికి భోజనం పూర్తయిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో తాజాగా పెట్టిన పెరుగు చిక్కగా, గట్టిగా తోడుకుంటే దాని రుచి మరింత బాగుంటుంది. అయితే వర్షాకాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏమిటంటే.. ఇంట్లో పెట్టిన పెరుగు జిగటగా, తీగలా మారుతుంది. మరి మనకు ఎంతో ఇష్టమైన పెరుగు జిగటగా మారకుండా, మంచి గడ్డ పెరుగు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.


