ప్రముఖ సింగర్ నిసార్ వాయనాడ్ (44) దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. సీనియర్ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ గొంతును పోలిన స్వరం కలిగిన నిసార్, దుబాయ్‌లో ఒక సంగీత ప్రదర్శన ఇవ్వడానికి కొన్ని గంటల ముందే తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించగా, అదే రోజు సాయంత్రం ఆయన మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వైద్య నివేదికల ప్రకారం, ఆయన మరణానికి అసలు కారణం సెప్టిసీమియా (Septicemia) అని, దీనివల్ల శరీరంలో అసిడోసిస్ (Acidosis) తలెత్తిందని తేలింది. నిసార్‌కు మధుమేహం (డయాబెటిస్) కూడా ఉంది. ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో తీవ్రమైన వాపు/ప్రతిస్పందన ఏర్పడి, పలు కీలక అవయవాలు విఫలం కావడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు సెప్టిసీమియా, సెప్సిస్, అసిడోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం.


