హిమాచల్ ప్రదేశ్‌లోని భాంబ్లా (ఇప్పుడు సుర్జీత్పూర్) అనే చిన్న పట్టణంలో జన్మించిన కంగనాను తల్లిదండ్రులు డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ ఆమెకు నటనపై ఆసక్తి ఉండటంతో ఇంట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇంట్లో వాదనల తర్వాత కుటుంబ ఆర్థిక సహకారం లేకుండానే 16 ఏళ్ల వయసులో ఢిల్లీకి, ఆ తర్వాత ముంబైకి చేరుకుంది. తొలినాళ్లలో థియేటర్ గ్రూపుల్లో నటిస్తూ, చిన్నచిన్న మోడలింగ్ అసైన్మెంట్లతో కెరీర్ ప్రారంభించింది. ఎవరితోనూ రాజీపడకుండా తనకు సరైనది అనిపించిన విషయాన్ని సోషల్ మీడియాలో గానీ, మైక్ ముందు గానీ నిర్మొహమాటంగా చెప్పడంలో కంగనా ముందుంటుంది.


