HomeTELANGANAతెలంగాణలో మళ్లీ వర్షాల జోరు.. సెప్టెంబర్‌ మూడో వారం నుంచి విస్తారంగా వర్షాలు

తెలంగాణలో మళ్లీ వర్షాల జోరు.. సెప్టెంబర్‌ మూడో వారం నుంచి విస్తారంగా వర్షాలు

తెలంగాణలో సెప్టెంబర్‌ 11, 12 తేదీల తర్వాత వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సెప్టెంబర్‌ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆరు నుంచి ఏడు రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగవచ్చని.. సెప్టెంబర్‌ నాలుగో వారం వరకు మోస్తరు జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పలుచోట్ల ఎండ, ఉక్కపోత కొనసాగుతున్నప్పటికీ రాత్రివేళల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments