లడఖ్‌లో నీటి కొరతను అధిగమించడంతో పాటు సింధు నది జలాలను వినియోగించుకునే దిశగా భారత్ కీలక అడుగు వేసింది. లేహ్‌లోని ఉప్షి వద్ద సింధు నదిపై దేశంలోనే తొలి రాక్ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. సహజ బండరాళ్లతో, సిమెంట్ లేకుండా నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ వల్ల నీటి మట్టం దాదాపు 10 అడుగులు పెరిగింది. దీంతో సుమారు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసి ఇగూ ఫే సాగునీటి కాలువ ద్వారా పొలాలకు నీటిని అందించనున్నారు. లడఖ్‌లో మరో 36 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదన పంపారు.
పాక్‌కు బిగ్ షాక్.. సింధు జలాల ఒప్పందం రద్దు వేళ లడఖ్‌లో తొలి రాక్ చెక్‌డ్యామ్ నిర్మించిన భారత్
RELATED ARTICLES


