తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ మరోసారి విమర్శలు చేశారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీ (SCERT), పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడం వల్లే పేపర్ లీకేజీకి దారితీసిందని ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే ఉద్యోగి వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ అక్రమాలపై నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సభలోనూ, మండలిలోనూ ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


