జనగామ జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవరుప్పుల, కొడకండ్ల మండల రైతులకు ఎస్సార్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి ఈ పాదయాత్ర చేపట్టారు. సింగరాజుపల్లి గ్రామం వద్ద ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో ఆయన నుదుటిపై గాయాలయ్యాయి. స్థానిక వైద్యుల చేత ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం పోలీసులు ఆయనను దేవరుప్పుల పోలీస్ స్టేషన్కు తరలించారు.


