HomeTELANGANAపామాయిల్‌, గంజి, పిండితో కల్తీ నెయ్యి తయారీ.. హోటళ్లు, స్వీట్‌ షాపులకు సరఫరా..!

పామాయిల్‌, గంజి, పిండితో కల్తీ నెయ్యి తయారీ.. హోటళ్లు, స్వీట్‌ షాపులకు సరఫరా..!

హైదరాబాద్‌ శివార్లలో నకిలీ నెయ్యి తయారీ చేస్తున్న ముఠాను హెచ్‌-ఫాస్ట్‌ పోలీసులు పట్టుకున్నారు. కాటేదాన్‌, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాల్లో 39 తయారీ కేంద్రాలు, 91 రిటైల్‌ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 25.5 టన్నుల నకిలీ నెయ్యితో పాటు 10 టన్నుల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్‌, మిల్క్‌ పౌడర్‌, గంజి, పిండి, రవ్వ, సింథటిక్‌ రంగులు, ఫ్లేవర్లతో నెయ్యిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యిని నగరంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, స్వీట్‌ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments