గాలే టెస్టులో శ్రీలంకపై 165 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసులో భారత్ తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో టీమిండియా పాయింట్ల పర్సంటేజ్ 48.14 నుంచి 53.33 శాతానికి మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తర్వాత భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచులు ఆడాల్సి ఉంది.



