Upper Circuit Stock: భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో సెషన్‌లో సూచీలు నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బుధవారం సెన్సెక్స్ 300, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టాల్లో ఉంది. అయినప్పటికీ ఒక పెన్నీ స్టాక్ మాత్రం భారీగా దూసుకెళ్తూ ఇన్వెస్టర్లు కాసుల పంట పండిస్తోంది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 56 శాతం ఎగబాకడం విశేషం.



