Credit Card Late Fee: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్ని వాడిని ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. బిల్లు నిర్దేశిత సమయానికి చెల్లించకపోతే జరిమానాలు పడతాయన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పొరపాటున కేవలం 46 పైసలు చెల్లించనందుకు లేట్ పేమెంట్ ఛార్జీల పేరిట రూ. 1200 విధించిందంట. దీనిపై కస్టమర్ ఎక్స్‌లో తన ఆవేదన పంచుకున్నాడు. పూర్తి వివరాల్ని చూద్దాం.


