ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ హత్య నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమెను గొంతుకోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పక్కా పథకం ప్రకారం హత్య చేసిన.. నిందితులు ఇంట్లో ఉండే నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హత్య కేసులో తాజాగా కీలక విషయం బయటపడింది. ఆమెను చంపింది ఆ స్కూల్‌లో చదువుకున్న పదో తరగతి స్టూడెంట్స్ అని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఆ ఇద్దరు కోసం గాలిస్తున్నారు.


